ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్,అక్టోబర్ 03: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వివేకానంద డిగ్రీ , పి.జి. కళాశాల కంప్యూటర్ విభాగధిపతి , అకాడమిక్ కోఆర్డినేటర్ బండి సంపత్ కుమార్ కు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసరా ప్రాణదాత 2026 అవార్డును ప్రధానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. శ్రీనివాస్ తెలిపారు. సంపత్ కుమార్ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో విద్యార్థులను రక్తదానం పట్ల ప్రోత్సహిస్తూ, తాను స్వయంగా 25 సార్లు ఆపద సమయంలో రక్తదానం చేసినందుకుగాను జిల్లా కేంద్రానికి చెందిన ఆసరా ఫౌండేషన్ ద్వారా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆసరా ప్రాణదాత అవార్డు గ్రహీత బండి సంపత్ కుమార్ ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. శ్రీనివాస్, ఏవో బి. శ్రావణ్ కుమార్, కామర్స్ విభాగాధిపతి మరియు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఆర్. గోపి కృష్ణ మరియు అధ్యాపక బృందం అభినందించారు.





























