*కుమ్మండానిగూడెంలో చండూరు ఆర్డీవో పర్యటన.. రీ-సర్వే సందేహాల నివృత్తి.
*భూ రీ-సర్వేపై రైతులతో ఆర్డీవో భేటీ.. క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన.
*రైతుల సమక్షంలో భూ రీ-సర్వే సమీక్ష.. అధికారులకు ఆర్డీవో దిశానిర్దేశం.
ప్రతి పక్షం చండూరు నవంబర్ 13: చండూరు మండలం కుమ్మండానిగూడెం గ్రామంలో చేపడుతున్న భూ రీ-సర్వే ప్రక్రియ నేపథ్యంలో చండూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) మేడమ్ గురువారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులతో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి, రీ-సర్వేపై వారి అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.భూముల కొలతలు, రికార్డుల సవరణ విషయంలో రైతులకు ఉన్న సందేహాలను ఆర్డీవో నివృత్తి చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా రీ-సర్వే పూర్తి చేయాలని సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో చండూరు తహసీల్దార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే (DIOS), మండల సర్వేయర్, గిర్దావర్లు, గ్రామ పాలనాధికారులు (GPOలు) మరియు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






























