*ట్యాంకుబండ్ పై 100 అడుగుల విగ్రహం పెట్టాలి.
*వీరనారి 131వ జయంతి వేడుకల్లో చా ఐ స ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్ డిమాండ్.
ప్రతిపక్షం, సెప్టెంబర్ 26, చండూరు: సబ్బండ వర్గాల మేల్కొల్పు గాత్రం, తెలంగాణ తల్లి, వీరనారి, రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను చండూరులో ఘనంగా నిర్వహించారు.
చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ (రి.నెం. 375/2010) ఫౌండర్ చైర్మన్ మీ ఐదారి నాగిళ్ళ శంకర్ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఫౌండర్ చైర్మన్ ఐదారి నాగిళ్ళ శంకర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ కేవలం తెలంగాణకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు, ప్రపంచంలోని కొన్ని దేశాలకు ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకురాలని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసిన ధీర వనిత ఐలమ్మ అని అన్నారు.
*చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా ప్రకటించాలి.
రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఇదే క్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ… -వీరనారి చాకలి ఐలమ్మను అధికారికంగా *తెలంగాణ తల్లిగా ప్రకటించాలి.-హుస్సేన్ సాగర్ ట్యాంకుబండ్ పై 100 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.
చాకలి ఐలమ్మ స్ఫూర్తికి నిదర్శనంగా 5 ఎకరాల్లో స్మృతి భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాబోయే రోజుల్లో ఐదారి కలం ద్వారా చాకలి ఐలమ్మ చిత్రపటాలను పంచడం, ప్రతిమలు ఇవ్వడం, ఐలమ్మ పురస్కారాలు, అవార్డులు ఇవ్వడం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, భూతరాజు దేవదాసు, ఐతరాజు మల్లేష్, భూతరాజు శ్రీహరి, భూతరాజు నరేష్, భూతరాజు యాదగిరి, భూతరాజు పాండు, నలపరాజు శంకర్, కొండమీది లవకుమార్, భూతరాజు వెంకన్న, భూతరాజు శేఖర్, ఏలే చంద్రశేఖర్, జన్ను, గంగిశెట్టి ప్రకాష్, జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.




























