మెదక్‌లో ఘనంగా సేవా జ్యోతి కలశ యాత్ర

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, అక్టోబర్ 07: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో ‘సేవా జ్యోతి కలశ యాత్ర’ ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద యాత్రను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రాందాస్ చౌరస్తా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా పోస్టాఫీసు కూడలి వరకు చేరుకున్నారు. అక్కడ సేవా జ్యోతి కూడలి’గా నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న 25 ఏళ్ల సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రజాసేవ, సుపరిపాలన, దేశాభివృద్ధి లక్ష్యాలతో కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జి బొక్క నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఈర్ల రంజిత్ రెడ్డి, సంగసని సురేష్, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, కౌన్సిలర్లు రాజమణి, లక్ష్మణ్, బెండవీన, కలిపి నాగరాజు, నల్లాల విజయ్, లోకేష్, అల్లం మధు, యువ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లిక, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్సింగ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రాములు నాయక్, వెల్మకన్నె రాజేందర్, శంకర్ గౌడ్, ఎంఎల్‌ఎన్ రెడ్డి తదితర నాయకులు, మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, మోర్చాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News