ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లెనిన్ ఎన్నిక

ప్రతి పక్షం చండూరు అక్టోబర్ 01: ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండలో జరిగాయి . రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ లో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా లెనిన్ (ఓయూ) ఎన్నికయ్యారు.నల్లగొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన లెనిన్, చండూరు మండల కేంద్రంలోని డాన్ బోస్కో జూనియర్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే ఏఐఎస్ఎఫ్ లో చేరారు. అనంతరం మండల అధ్యక్షుడిగా, జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసిస్తూ ఓయూ ఏఐఎస్ఎఫ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేసి, ప్రస్తుతం ఓయూ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.విద్యారంగ సమస్యలపై, పరీక్షా పత్రాల లీకులకు వ్యతిరేకంగా, యూనివర్సిటీ హాస్టల్ సమస్యలపై, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ పైన, యూనివర్సిటీ పరిరక్షణకై, ప్రభుత్వ యూనివర్సిటీల పట్ల ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఓయూ కేంద్రంగా నిర్వహించిన అనేక ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు.

ఎన్నిక అనంతరం లెనిన్ మాట్లాడుతూ… “ఏఐఎస్ఎఫ్ ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో, శాస్త్రీయ విద్య కోసం, కామన్ విద్యా విధానం కోసం పోరాటాలు నిర్వహిస్తూ ఎందరో త్యాగధనులను, వీరులను అందించింది. వారి స్ఫూర్తితో భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారానికై, విద్యా పరిరక్షణకై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్రియాశీలకంగా పనిచేస్తాను” అని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కొండాపురం గ్రామానికి చెందిన లెనిన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల చండూరు మండల విద్యార్థులు, యువకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News