ప్రతిపక్షం, నవంబర్ 19: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక సమాచారం అందింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ప్రకటించిన టైమ్‌టేబుల్ ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానుండగా, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు తేదీలను ఖరారు చేసింది. విద్యార్థులు పరీక్షలకు ముందుగానే సిద్ధమయ్యేందుకు వీలుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు తమ చదువుపై మరింత దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇక ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 18వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
విద్యార్థులు ప్రకటించిన పరీక్షల షెడ్యూల్‌కు అనుగుణంగా చదువును ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలని సూచిస్తున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు, వార్షిక పరీక్షలకు మధ్య ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సన్నద్ధతను పెంచుకోవాలని విద్యావర్గాలు సూచిస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన పూర్తి సబ్జెక్టుల వారీ టైమ్‌టేబుల్‌ను విడుదల చేసిన షెడ్యూల్‌లో పరిశీలించవచ్చు.





























