స్వీట్లలో అల్యూమినియం.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమంటే?

ప్రతిపక్షం, నవంబర్ 18: స్వీట్లు, ఆహార పదార్థాలపై మెరుపు కోసం ఉపయోగించే అల్యూమినియం పొర ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తోంది. తక్కువ పరిమాణంలో అల్యూమినియం శరీరంలోకి చేరితే సాధారణంగా మలం, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో శరీరంలో పేరుకుపోతే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెదడు, ఎముకలు, ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వివరిస్తున్నారు. నాడీ వ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, కండరాల నియంత్రణ దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురుకావచ్చని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో నాడీ సంబంధిత సమస్యల ప్రమాదం కూడా పెరగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే స్వీట్లపై మెరుస్తూ కనిపించే అలంకరణ పదార్థాల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే పదార్థాలు సురక్షితమైనవో కాదో తెలుసుకోవడంతో పాటు, నాణ్యతా ప్రమాణాలు పాటించే దుకాణాల నుంచే స్వీట్లు కొనుగోలు చేయడం మంచిది.

Related News

Latest News