భూసార పరిరక్షణకు రసాయన ఎరువులు తగ్గించాలి: ఏఓ మల్లేష్

*దోనిపాములలో ఖేతీ బచావో అభియాన్ అవగాహన సదస్సు.

*పంటల వైవిధ్యీకరణతోనే రైతుకు అధిక లాభం.

*యాసంగిలో వరికి బదులు చిరుధాన్యాలు వేయండి: ఏఓ మల్లేష్

*ఫార్మర్ ఐడీ ఉంటేనే సబ్సిడీలు – రైతులకు ఏఓ సూచన .

ప్రతిపక్షం – చండూరు, అక్టోబర్ 28: తక్కువ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి భూసారాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని చండూరు మండల వ్యవసాయ అధికారి పి.మల్లేష్ రైతులకు పిలుపునిచ్చారు.గురువారం చండూరు మండలం దోనిపాముల గ్రామంలో జరిగిన ‘ఖేతీ బచావో అభియాన్’ మరియు పంటల వైవిధ్యీకరణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. యాసంగి సీజన్ లో వరి పంటకు బదులుగా తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు వేస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు.అలాగే ఫార్మర్స్ రిజిస్ట్రీ నమోదు ఇంకా చేసుకోని రైతులు వెంటనే సంబంధిత ఏఈఓలను కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే అన్ని సబ్సిడీలు, పథకాలకు ఈ ఫార్మర్ ఐడీనే ప్రామాణికంగా తీసుకుంటారని వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి పద్మజ, మాజీ సర్పంచ్ పి.యాదయ్య, జి.రామస్వామి, ఎస్.లింగస్వామి, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News