కలెక్టర్ కార్యాలయం వద్దమహాధర్నా
రైస్ మిల్లును రక్షించండి
మిల్లర్లపై ఒత్తిడి, దాడులు ఆపాలి
జిల్లా రైస్ మిల్లర్లు అసోసియేషన్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ సెప్టెంబర్ 10: రాష్ట్రంలో రైస్ మిల్లర్ల ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మెదక్ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైస్ మిల్లర్లు మహాధర్న కార్యక్రమాన్ని చూపెట్టారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చంద్రపాల్ వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, రైస్ మిల్లింగ్ రంగాన్ని రక్షించాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. మిల్లర్లపై జరుగుతున్న ఒత్తిడి, దాడులను నిలిపివేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, విద్యుత్ చార్జీలు, కార్మికుల వ్యయాలు, రవాణా ఖర్చుల కారణంగా రైస్ మిల్లింగ్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని వారు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో మిల్లింగ్ చార్జీలను తక్షణమే పెంచి, మిల్లర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా ఓటీఆర్ (OTR)ను వెంటనే పెంచాలనిœ మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో Sortex వినియోగం వల్ల ఏర్పడే 15 నుంచి 20 శాతం వరకు స్టోరేజీని అనుమతించాలని కోరుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను సడలించి, మిల్లర్లకు ఆర్థిక భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.రైస్ మిల్లింగ్ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది కార్మికులు, రవాణా రంగం, అనుబంధ వ్యాపారాలు కొనసాగుతున్నాయని, మిల్లుల మనుగడకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మిల్లర్లు తెలిపారు.
జిల్లా రైస్ మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, ఓటీఆర్ పెంపు, మిల్లింగ్ చార్జీల పెంపు, Sortex స్టోరేజీ అనుమతితో పాటు మిల్లర్లపై ఒత్తిడి, దాడులను నిలిపివేసి పరిశ్రమను కాపాడాలని వారు వారు కోరారు రైతు పంట పండిస్తూనే రైస్ మిల్లర్లు బాగుంటాయని దీంతో కార్మిక కర్షక రంగాలవారు భద్రత ఉంటుందని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మెదక్ జిల్లా రైస్ మిల్లర్లకు బకాయి ఉన్న 200 కోట్ల రూపాయలను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను విజిలెన్స్ అధికారులు చేపట్టడం తక్షణమే ఆపివేయాలని రైస్ మిల్లర్లు మనోవేదనను గురి చేయకుండా ప్రభుత్వాన్నిదని వారు తెలిపారు మిల్లర్లు ఆత్మ గౌరవంగా బతకాలని రైస్ మిల్లర్లను బతికించాలని వారు తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. మహా ధర్నా కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.
































