[t4b-ticker]

గణేష్ నిమజ్జనంలో DJ వద్దు.. శాంతిని పాటిద్దాం: చండూరు ఎస్ఐ శివకుమార్.

*లౌడ్ స్పీకర్లు, గుంపులు వద్దు.. సాంప్రదాయ భక్తికే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు

ప్రతిపక్షం, చండూరు సెప్టెంబర్ 22 : వినాయక నిమజ్జన వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని చండూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివకుమార్ పిలుపునిచ్చారు. నిమజ్జన శోభాయాత్రలో DJ సౌండ్ సిస్టంలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్ స్పీకర్ల వాడకం నిషేధమని స్పష్టం చేశారు.ఈ మేరకు నల్లగొండ జిల్లా చండూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన పోస్టర్ ను విడుదల చేశారు. మన సంస్కృతి.. మన బాధ్యత.. శాంతి చెతిలొనే నిజమైన భక్తి అని పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్లు వద్దు – శబ్ద కాలుష్యం తగ్గిద్దాం . DJ సౌండ్లు వద్దు – సాంప్రదాయ భక్తి మాత్రమే పాటిద్దాం . గుంపులు వద్దు – అందరూ సురక్షితంగా ఉండాలి . పోలీసులకు సహకరించండి – మద్దతు ఇవ్వండి అని యువకులను ఆదేశించారు .ప్రజల భద్రత మా బాధ్యత, మీ భద్రతే మా ప్రాధాన్యం అని ఎస్ఐ శివకుమార్ తెలిపారు. నిబంధనలు పాటించి నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా జరుపుకునేలా సహకరించాలని కోరారు.

Spread the love

Related News

Latest News