ప్రతిపక్షం, జూలై 28: ప్రముఖ నటి పావలా శ్యామల మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గుండెపోటుతో కన్నుమూసిన ఆమె అంతిమ సంస్కారాలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వెల్లడైంది.
ఈ బాధ్యతలను తాను స్వయంగా పర్యవేక్షిస్తానని నటి కరాటే కళ్యాణి తెలిపారు. రేపు ఉదయం వనస్థలిపురం శ్మశానవాటికలో పావలా శ్యామల అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు.
అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పావలా శ్యామల కుమార్తెకు కూడా అన్ని విధాలా అండగా ఉంటామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హామీ ఇచ్చింది. సినీ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పావలా శ్యామలకు తుది వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం.
దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

















