డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

*డిండికి 0.6 టీఎంసీ ఇవ్వడంపై సీఎం నిర్ణయం హర్షణీయం.

*ఏ జిల్లా నీరు అక్కడే వాడాలంటే కర్ణాటక నుంచి చుక్క నీరు రాదు .

*పాలమూరును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేలా ఎంపీ కృషి చేయాలి – గుత్తా హితవు

ప్రతి పక్షం నల్గొండ, అక్టోబర్ 25: మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిండి ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.జాతీయ పార్టీలో ఉండి ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. డిండి ప్రాజెక్టుకి 0.6 టీఎంసీ నీటిని ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షించదగిన పరిణామమని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు ఎంపీ కృషి చేయాలని సూచించారు.ఏ జిల్లా నీరు అక్కడే వినియోగించాలంటే.. కర్ణాటక నుంచి చుక్క నీరు కూడా రాదని ఆయన హితవు పలికారు. ఏఎంఆర్పీ ద్వారా ఏడాది పొడవునా 30 టీఎంసీల నీటిని హైదరాబాద్ కు అందిస్తున్నారని గుర్తుచేశారు.దశాబ్దాల ఫ్లోరైడ్ పీడ విరగడ కోసమే డిండి లిఫ్ట్ స్కీమ్ చేపట్టారని, దేవరకొండ, మునుగోడు లలో ఫ్లోరైడ్ పోవాలంటే డబ్ల్యూహెచ్ఓ సూచన మేరకే డిండి ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలు ప్రతిపాదిత సాగుకు గానూ 7.78 లక్షల ఎకరాల్లోనే ఆయకట్టు సాగు జరుగుతోందని, ఎస్ఎల్బీసీ, ఉదయసముద్రం, డిండి, దేవాదుల కింద 7.58 లక్షల ఎకరాల ప్రతిపాదన ఉన్నా ఏదీ కంప్లీట్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.మనం మనం తగాదాలు పడితే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతాంగానికే నష్టం జరుగుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Spread the love

Related News

Latest News