ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: హైదరాబాద్ కూకట్పల్లి వివేకానందనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రమేశ్ (40) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రాధిక పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి ట్యాంక్‌బండ్‌కు వెళ్లేందుకు రమేశ్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత రాధిక ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో రమేశ్ ఆమె ఫోన్‌కు ‘సారీ.. గుడ్‌బై’ అంటూ ఎస్ఎంఎస్ పంపినట్లు సమాచారం. ఆ సందేశంతో ఆందోళనకు గురైన రాధిక వెంటనే ఇంటికి తిరిగి వచ్చి చూడగా.. రమేశ్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు.
వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేశ్ ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.





























