అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా బైక్ ర్యాలీ
ప్రతిపక్షం, సెప్టెంబర్ 03, శామీర్ పేట: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష, మున్సిపల్ కౌన్సిలర్లు ముద్దం సుధాకర్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, డైరెక్టర్లు తుంకి బిక్షపతి, బొమ్మక్ శ్రీనివాస్, నాయకులు భూమిరెడ్డి నవీన్ రెడ్డి, సరసం అశోక్ రెడ్డి, యంజాల సుజాత రెడ్డి, బండారి బాబు, కోడూరి దినేష్, గుర్కలా సాయి కృష్ణ యాదవ్, నేమురి రాంప్రసాద్ గౌడ్, ముద్దం రాఘవ రెడ్డి, సంగనామైనా కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు తంటం రాము, పప్పుల వేణుగోపాల్ రెడ్డి, ముద్దం వీరారెడ్డి, ధర్మారెడ్డి, గిర్మాపూర్ నర్సింగరావు గౌడ్, కొమ్ము వినోద్, వీరన్నగారి భూపాల్, సాయి, చిలుగురి మల్లేష్, తుంకి స్వామి, వల్లపు మహేష్, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేశారు.





























