ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: తెలంగాణలో కీలక పదవుల్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో గద్వాల విజయలక్ష్మి నిర్వహిస్తున్న మహిళా కమిషన్ చైర్మన్ పదవికి నేరెళ్ల శారదను నియమించింది. దీంతో ఒకే సమయంలో రెండు కీలక పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించి, ఆ బాధ్యతలను గద్వాల విజయలక్ష్మికి అప్పగించగా.. ఆమె స్థానంలో మహిళా కమిషన్ చైర్మన్గా నేరెళ్ల శారదను నియమించారు.
ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నియామకాలతో రాష్ట్రంలోని కీలక సంస్థలకు కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టనుంది. ప్రభుత్వ నిర్ణయం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.




























