ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: వరంగల్ రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్‌గా గుండు సుధారాణిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
గుండు సుధారాణికి కుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించడంతో వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆమె పాత్ర పెరగనుంది. పట్టణ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, పార్కులు, ఇతర పట్టణ ప్రణాళిక అంశాల్లో కుడా కీలకంగా వ్యవహరిస్తుంది.
కుడా చైర్మన్‌గా గుండు సుధారాణి నియామకం వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న పదవుల పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నియామకం జరిగినట్లు చర్చ జరుగుతోంది.




























