ప్రతిపక్షం, సెప్టెంబర్ 03: తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరెళ్ల శారదను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న గద్వాల విజయలక్ష్మి స్థానంలో నేరెళ్ల శారదను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.