[t4b-ticker]

గాంధీభవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’.. ఈ వారం మంత్రి శ్రీధర్‌బాబుతో నేరుగా మాట్లాడే అవకాశం

ప్రతిపక్షం, ఆగస్టు 10: హైదరాబాద్‌ నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఈ వారం ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు, సమస్యలను స్వీకరించనున్నారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారం కోసం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వానికి సంబంధించిన వివిధ సమస్యలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురావచ్చని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. దీంతో తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పలువురు ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News