ఫారం–18తో నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని తుంకి రమేష్ పిలుపు
ప్రతిపక్షం,శామీర్ పేట, అక్టోబర్ 01: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, డిగ్రీ పూర్తిచేసిన అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్ కోరారు.
సెప్టెంబర్ 28, 2026 నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్ 6, 2026 చివరి తేదీ అని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమని, అర్హత ఉన్న ఒక్క పట్టభద్రుడు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా చొరవ చూపాలని తుంకి రమేష్ పిలుపునిచ్చారు.





























