రాజీవ్ గాంధీ చొరవతోనే స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత

ప్రతిపక్షం బ్యూరో, నిజామాబాద్ ఆగష్టు 20: దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ చొరవతోనే స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత దక్కిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశాభివృద్ధికి చేసిన సేవలను, యువత కు ఓటు హక్కు, సాంకేతిక రంగం పట్ల ఆయన దూరదృష్టిని టీ పీసీసీ చీఫ్ స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

Spread the love

Related News

Latest News