[t4b-ticker]

సిద్దిపేటలో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, ఆగస్టు 15, సిద్దిపేట: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసు బలగాల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన కవాతును ఆయన పరిశీలించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో నిర్వహించిన పరేడ్‌ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదలు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News