ఆరు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 02: జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ చారి డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ.. బెంగళూరులో నిర్వహించిన ఐజేయూ కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని సమావేశం ఖండించినట్లు పేర్కొన్నారు.ఆరు ప్రధాన డిమాండ్లు ఇవే..
.మీడియా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. మీడియా సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. రద్దు చేసిన చట్టాల స్థానంలో జర్నలిస్టుల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలి.జర్నలిస్టుల వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలి..తెలంగాణలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలి.జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించి, నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలి.పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మీడియా కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక, చట్టపరమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తమ డిమాండ్లతో కూడిన లేఖలను పంపించినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న తరహాలో హెల్త్ కార్డులు మంజూరు చేసి క్యాష్‌లెస్ వైద్య చికిత్స అందించాలని టీయూడబ్ల్యూజే నాయకులు డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని పాలన అధికారి కీ వినతి పత్రం సమర్పించారు.ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు బొందుగుల నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు డీజే శర్మ, మాజీ ఐజేయూ సభ్యుడు మినుపూరు శ్రీనివాస్, ఫారుక్ హుస్సేన్, సీనియర్ జర్నలిస్ట్ చాగంటి హరినాథ్, మురళి, లక్ష్మీనారాయణ, శ్రీధర్, కామాటి కృష్ణ, చింతల రమేష్, ప్రసాద్, ప్రకాష్, గోవర్ధన్ రెడ్డి, బోనగిరి చంద్రశేఖర్, సుదం రాజ శేఖర్,రామకృష్ణ, శ్రీహరి, సుబ్బా, కార్తీక్. రమేష్ గౌడ్, నగేష్, శివ చరణ్, రాము పటేరి, ప్రకాష్, రామ కృష్ణ గౌడ్, కృష్ణ గౌడ్, రాజశేఖర్, ఖయ్యుం, యూసుఫ్ అలీ, సఫ్దర్, హమీద్, రాము పటేరి, నరేందర్, నర్సింహులు, సత్యనారాయణ, బైరవరెడ్డి, రాంచందర్ రెడ్డి, గిరి, సాయి, ఆంజనేయులు గౌడ్, సుభాష్, రాఘవులు, జనార్దన్, రఘు, స్వాగత్ రాజు, శ్రీను, అల్లాడి శేఖర్,సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






























