12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి: పద్మా దేవేందర్‌రెడ్డి
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 9: వ్యవసాయానికి 12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట మండలం లక్ష్మాపూర్ స్టేజ్ వద్ద రైతులు నిర్వహించిన ధర్నాకు మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మద్దతు తెలిపారు. వరి పంట కీలక దశలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాట్రియాల్, లక్ష్మాపూర్, పర్వతాపూర్, దంతేపల్లి గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. పంటలు ఎండిపోకుండా అధికారులు తక్షణమే స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.































