కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి
కోదాడ ప్రతిపక్షం నవంబర్ 24: కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్ రావు 87 వ జన్మ దిన సందర్భంగా మంగళవారం నాడు అనంతగిరి మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణం లో చందర్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించిన అనంతరం కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ నాలుగు సార్లు కోదాడ శాసనసభ్యులుగా ఎన్నికై , స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న ప్రజల మనిషి మేనేపల్లి చందర్ రావు అని అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి తన సహకారాలు ఎ ప్పుడు ఉండాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న అని అన్నారు ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు, కామ్రేడ్ అంజయ్య, ఆలయ కమిటీ బాధ్యులు సైదులు సైదా నాయక్, తదితరులు పాల్గొన్నారు.



























