సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి

ప్రతిపక్షం, నవంబర్ 24: హైదరాబాద్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువుల కారణంగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. బాచుపల్లి పరిధిలోని దినేష్ ఆర్‌కే అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్యాంక్‌ శుభ్రం చేసే పనిలో నిమగ్నమైన కార్మికులు ఒక్కసారిగా విషవాయువుల ప్రభావానికి గురై అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తోంది. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

సెప్టిక్ ట్యాంకుల్లో పేరుకుపోయే విషవాయువులు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. సరైన భద్రతా పరికరాలు, తగిన జాగ్రత్తలు లేకుండా ఇలాంటి ట్యాంకుల్లోకి దిగడం అత్యంత ప్రమాదకరం. ముగ్గురు కార్మికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుల గుర్తింపు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Latest News