ప్రతిపక్షం, నవంబర్ 15: వర్ధన్నపేట నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంతో అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి స్వయంగా అందజేయడంతో కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర స్థానిక నాయకుల సమక్షంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.





























