పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండలో భారీ బైక్ ర్యాలీ.

*జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.

*పోలీస్ అమరుల స్ఫూర్తితో నల్గొండలో హోరెత్తిన దేశభక్తి నినాదాలు.

*జిల్లా పోలీస్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు హోరెత్తిన ర్యాలీ.

*అమరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి – మెరుగైన సేవలే నివాళి.

*అమరుల త్యాగం వెలకట్టలేనిది: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ప్రతిపక్షం – నల్గొండ, అక్టోబర్ 26: దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ పట్టణం దేశభక్తితో మార్మోగింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పోలీస్ వాహనాల హారన్ల మధ్య ర్యాలీ ఎన్.జి కళాశాల, రామగిరి, క్లాక్ టవర్ మీదుగా దూసుకెళ్లింది.

ఈ ఏడాది 154 మంది బలిదానం :

ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా 154 మంది పోలీసులు, తెలంగాణలో నలుగురు అమరులయ్యారని, వారి త్యాగం చిరస్మరణీయమని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని, వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించడమే నిజమైన నివాళి అన్నారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, 12వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ నాగేశ్వర్ రావు, డీఎస్పీలు శివరాం రెడ్డి, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News