*విరాళం అందించిన గురిజాల ధనయ్య-పద్మ దంపతులు.
ప్రతిపక్షం చండూరు అక్టోబర్ 04: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ నిధికి గురిజాల ధనయ్య – పద్మ దంపతులు ఆదివారం రూ.1,00,000/- (లక్ష రూపాయలు) నగదు విరాళాన్ని ఆలయ నిర్వాహకులకు అందించారు.విరాళం అందించిన దంపతులకు అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, ఐతరాజు మల్లేష్, బొమ్మరబోయిన వెంకటేశ్వర్లు, ఇరిగి వెంకటేశం ,సరికొండ వెంకన్న , అనిల్, దోటి వెంకన్న, రామస్వామి వెంకన్న, ప్రవీణ్ శర్మ, రాపో వెంకటేశం, ఎలా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.





























