తుపానుపై ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి

వరి కోతలను వాయిదా వేసుకోవాలి.

ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాలి

అధికారులంతా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రతిపక్షం మెదక్ ప్రతినిధి, నవంబర్ 01: అర్నబ్ తుపాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి పంట నష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోతలు పూర్తయి కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడవకుండా టార్పాలిన్లతో కప్పి భద్రపరచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులకు పంటల రక్షణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని, అన్ని శాఖల అధికారులు తమ తమ మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పంటలు చేతికొచ్చే సమయంలో రైతులకు నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Related News

Latest News