*చెడుపై మంచి విజయానికి ప్రతీక దసరా – ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలి
*ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించిన చైర్మన్.
ప్రతిపక్షం చండూరు అక్టోబర్ 19: చండూరు మున్సిపల్ పట్టణ ప్రజలకు మరియు చండూరు మండల ప్రజలందరికీ చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు గారు విజయదశమి (దసరా) పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆ విజయదుర్గ అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.చండూరు మున్సిపల్ పట్టణంతో పాటు మండలంలోని ప్రతి గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజల మధ్య బంధుత్వాలు, స్నేహభావాలు మరింత బలోపేతం కావాలని కోడి శ్రీనివాసులు గారు ఆకాంక్షించారు.చండూరు పట్టణ అభివృద్ధిలో ప్రజలు అందిస్తున్న సహకారం మరువలేనిదని, రానున్న రోజుల్లో కూడా అదే సహకారం అందించాలని ఆయన కోరారు. అందరికీ మరోసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.





























