రోడ్డు ప్రమాదంలో గాయపడిన బన్సోడె శాలినికి సుమారు రూ.2 లక్షల సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన -ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి
ప్రతిపక్షం, నవంబర్ 28, బైంసా: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి చొరవ చూపారు. బైంసా పట్టణానికి చెందిన బన్సోడె శాలిని ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆసుపత్రి ఖర్చులు అయ్యాయి.ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బాధితురాలి పరిస్థితిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి, గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సుమారు రూ.2 లక్షల ఆర్థిక సహాయం మంజూరు కాగా, ఈరోజు బాధితురాలు బన్సోడె శాలినికి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక చొరవ తీసుకున్న ముధోల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ జి. విఠల్ రెడ్డిలకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, మాల మహానాడు అధ్యక్షులు డోంగ్రే భీమ్ రావు, దళిత నాయకుడు బన్సూడే, బాసర సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్లు, సర్పంచ్ చరణ్, మాజీ సర్పంచ్ మక్బూల్, నరేష్, శంకర్ పాటిల్, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పాటిల్, ఉపసర్పంచ్ రమేష్, పుండలిక్, రమేష్, విఠల్ గొడసేరా తదితర సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఆపదలో ఉన్న వారికి ఆర్థిక భరోసా కల్పించడం, ప్రజా ప్రతినిధుల చొరవతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

























