ఎమ్మార్పీఎస్, జిల్లా నాయకులు, కాశవత్తుల లక్ష్మీ రాజం మాదిగ.
ప్రతిపక్షం, జగిత్యాల (ప్రతినిధి) నవంబర్, 04: జగిత్యాల జిల్లాలోని కథలాపూర్ మండలం చింతకుంట, గ్రామంలో ఎస్సీ, కాలనీలో గత ఆరు నెలల నుండి డ్రైనేజీ పైకప్పు పూర్తిగా ధ్వంసం అయిన ప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించు కోవడంలేదని ఎమ్మార్పీఎస్, జిల్లా సీనియర్ నాయకులు కాశవతుల లక్ష్మీ రాజం, మాదిగ ఆరోపించారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజం మాట్లాడుతూ “డ్రైనేజీ పైకప్పు”ను త్వరిత గతిన నూతనంగా మళ్లీ పైకప్పు వేయాలని లేనిచో వచ్చే సోమవారం “ప్రజావాణి”లో కోరుట్లలో ఆర్డీవో, కు ఫిర్యాదు చేస్తానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎస్సీ, కాలనీ నుండి కథలాపూర్ వెళ్లి బైపాస్ రోడ్డు, ఈ యొక్క రహదారిపై డ్రైనేజీ ధ్వంసం కావడం వల్ల రైతులు పండించిన ధాన్యాన్ని తీసు కురావడానికి రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు. పక్కనే రైతుల పంట పొలాలకు వెళ్ళుటకు ఈ దారి ముఖ్యంగా ఉప యోగపడు తుందని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు వేణు వెంటనే ఇట్టి డ్రైనేజీ పై పైకప్పు నిర్మాణం చేపట్టాలని ఆయన అన్నారు.

























