ప్రతిపక్షం,మొయినాబాద్, అక్టోబర్ 20: మొయినాబాద్ మండలం అమ్డాపూర్ గ్రామంలో దసరా జమ్మి వేడుకలను గ్రామ యువకులు, పెద్దలు కలిసి రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్యపాగ కృష్ణ గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, గ్రామ ఐకమత్యం కొనసాగాలని ఆకాంక్షించారు.





























