పాత్రికేయ మిత్రుడు సింగారం ప్రకాష్‌కు ఘన సన్మానం

ప్రతిపక్షం ప్రతినిధి ముధోల్ నవంబర్ 29: నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ సీనియర్ పాత్రికేయులు సింగారం ప్రకాష్‌కు ఘన సన్మానం నిర్వహించారు.తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఆయనకు మీడియా మిత్రుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయ మిత్రులు సింగారం ప్రకాష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు పాత్రికేయ మిత్రులు అభినందించారు.మరెన్నో పదవులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కపిల్ వాగ్మారే, వార్త దినపత్రిక పాత్రికేయులు కారండే గంగాధర్, వార్డు మెంబర్ వాగ్మారే శుద్ధోదన్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కస్తూరే జైపాల్,సింగిల్ విండో చైర్మన్ అంబేకర్ సాయి తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News