[t4b-ticker]

రాహుల్ గాంధీపై నమోదు చేసిన FIRను వెంటనే రద్దు చేయాలి.

*బీజేపీ కుట్రలను తిప్పికొడతాం – యూత్ కాంగ్రెస్.

*చండూరులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన.

ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 01: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ఉత్తరాఖండ్ లో పోలీసులు నమోదు చేసిన అక్రమ FIRను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చండూరు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజాదరణను చూసి ఓర్వలేక బీజేపీ కావాలనే కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, బీజేపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు.ఈ ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే FIRను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీకి అండగా ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News