*నివాళులర్పించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.
*కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే.
ప్రతిపక్షం, చౌటుప్పల్ సెప్టెంబర్ 27 : మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు, మునుగోడు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్ గారి మాతృమూర్తి పబ్బు వజ్రమ్మ గారు నిన్న శివైక్యం చెందారు.ఈ విషాద వార్త తెలుసుకున్న గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు ఈరోజు చౌటుప్పల్ మండలం మల్కాపూర్ లోని పబ్బు రాజు గౌడ్ నివాసానికి వెళ్లారు.అక్కడ వజ్రమ్మ గారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పబ్బు రాజు గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. వజ్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.































