గూడు లేని పేదల గుండెల్లో దీపావళి వెలుగులు..

ఇందిరమ్మ ఇళ్లలో పండుగ సంబురాలు!

పేదల సొంతింటి కలలో.. దీపావళి వెలుగులు!

ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారుల సంబురాలు..

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 9: ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురు చూసిన పేద కుటుంబాల జీవితాల్లో ఇందిరమ్మ ఇళ్లు కొత్త వెలుగులు నింపాయి. సొంతింటి కల సాకారం కావడంతో ఈ ఏడాది దీపావళి పండుగను తమ కొత్త ఇళ్లలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నంగునూరు మండల కేంద్రంతో పాటు సిద్ధన్నపేట గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులు దీపాలు వెలిగించి, కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాలుస్తూ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంగునూరులో ముఖ్య అతిథిగా టీపీసీసీ కార్యదర్శి, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, సిద్ధన్నపేటలో గ్రామ సర్పంచి సంగు పురేందర్, ఉప సర్పంచి చిలుకల తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు చిలుకల రాజిరెడ్డి, కందికట్ల రాజు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దేవులపల్లి యాదగిరి, సంగు పురేందర్ మాట్లాడుతూ.. పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. కొత్త ఇంట్లో దీపావళి పండుగ జరుపుకోవడం లబ్ధిదారుల జీవితాల్లో మరిచిపోలేని మధురానుభూతిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే ప్రభుత్వ సంక్షేమ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి సంబురాల సందర్భంగా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మైనంపల్లి హనుమంతరావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు దాసరి కిషన్, అనరాజు నాగరాజు, చెలికాని యాదగిరి, తుపాకుల శ్రీనివాస్, ఎండీ ఏజాజ్ ఉద్దీన్, సిద్ధన్నపేట గ్రామపంచాయతీ సిబ్బంది పరకాల కనకారెడ్డి, దేవులపల్లి మల్లయ్య సంబంధిత అధికారులు, వార్డు సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related News

Latest News