[t4b-ticker]

మాజీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ

ప్రతిపక్షం, ఆగస్టు 08: రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని హైదరాబాద్ మున్సిపల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ‘మెసర్స్ ఇంటెల్లిడెక్స్’ సంస్థకు ఆయన జారీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్ మూడు సార్లు బౌన్స్ కావడంతో సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఖుష్బూ ఉపాధ్యాయ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా తేల్చారు. అయితే తీర్పు వెలువడే సమయంలో ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

Spread the love

Related News

Latest News