[t4b-ticker]

ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులకు అసలు కారణం ఇదేనా? కెప్టెన్‌పై డ్రగ్స్ ఆరోపణలు

ప్రతిపక్షం, ఆగస్టు 09: ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఇటీవల చోటుచేసుకున్న తీవ్ర కుదుపుల ఘటనపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఐ 2379 విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడంతో 12 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే.

ఈ ఘటనకు సంబంధించి విమానాన్ని నడిపిన కెప్టెన్‌కు ఢిల్లీలో మాదకద్రవ్యాల పరీక్ష నిర్వహించగా.. డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఎయిర్‌ ఇండియా నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎత్తు తగ్గడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేబిన్‌లో కుదుపులు రావడంతో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

కెప్టెన్‌కు నిర్వహించిన పరీక్షలో మాదకద్రవ్యాల వినియోగం నిర్ధారణ అయిందన్న వార్తలు నిజమైతే.. విమాన భద్రతకు సంబంధించిన కీలక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అయితే పరీక్షల ఫలితాలు, కుదుపులకు కెప్టెన్‌ ఆరోపించిన డ్రగ్స్‌ వినియోగానికి మధ్య నేరుగా సంబంధం ఉందని ఇప్పుడే నిర్ధారించలేం. అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News