ప్రతిపక్షం, ఆగస్టు 10: క్రియేటర్ జర్నలిస్ట్స్ ప్రాజెక్ట్ (CJP)లో కీలకంగా వ్యవహరిస్తున్న 12 మంది వ్యక్తుల విద్యార్హతలు ఆసక్తికరంగా మారాయి. జర్నలిజం, ఇంజినీరింగ్, న్యాయశాస్త్రం, మేనేజ్‌మెంట్, రాజకీయ శాస్త్రం, హోటల్ మేనేజ్‌మెంట్, చార్టర్డ్ అకౌంటెన్సీ వంటి విభిన్న రంగాల్లో వీరు విద్యను అభ్యసించారు.
అభిజీత్ దీప్కే (మహారాష్ట్ర): జర్నలిజంలో డిగ్రీతో పాటు పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ చేశారు.
అశుతోష్ (జైపూర్): బీటెక్ పూర్తి చేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.
సౌరవ్ (ఢిల్లీ): జర్నలిజంలో డిగ్రీ చేశారు.
అజింక్య (మహారాష్ట్ర): బీటెక్ చదివారు.
దీపక్ (రాజస్థాన్): పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు.
ఆఫ్రిన్ (బెంగళూరు): ఎంబీఏ పూర్తి చేశారు.
విజయ్ (హైదరాబాద్): బీఈతో పాటు మాస్టర్స్ చేశారు.
రత్న సింగ్ (లక్నో): ఆయన విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేవు.
వైష్ణవి (డెహ్రాడూన్): ఎల్‌ఎల్‌బీ చదివారు.
రోహన్ (ముంబై): హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారు.
యోగేశ్ (పుణే): చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేశారు.
అంకిత్ (ఉత్తరప్రదేశ్): చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేశారు.
వీరి విద్యా నేపథ్యాలను పరిశీలిస్తే.. ఒకే రంగానికి పరిమితం కాకుండా వివిధ విద్యా, వృత్తి రంగాలకు చెందిన వ్యక్తులు ఈ బృందంలో ఉన్నట్లు తెలుస్తోంది.





























