ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలు అందించాలి
రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి, బి. కొండల్ రెడ్డి. శంకర్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 19: రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వ పరంగా సబ్సిడీలు సంక్షేమ పథకాలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు.కన్నెగంటి రవి, బి. కొండల్, శంకర్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ” ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కౌలు రైతుల సమావేశం కమిటీ సభ్యులు బాలరాజు, సంజీవ్ లు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్న పేట, శివం పేట, నిజాం పేట, హత్నూర, శంకరంపేట్ మండలాల కౌలు రైతులు సమావేశంలో పాల్గొన్నారు. కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ రాష్ట్ర, జిల్లా నాయకులు సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు.కన్నెగంటి రవి, మాట్లాడుతూ తెలంగాణలో 36 శాతం పైగా ఉన్న కౌలు రైతులు పంటల ఉత్పతి లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ రైతులకు అందే సౌకర్యాలు కౌలు రైతులకు అందడం లేదు. ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోవడం వలన సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, పంట నష్టపరిహారం, రైతు బీమా – ఆఖరికి తమ పంటను ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్ముకునే అవకాశం కూడా కౌలు రైతులకు లభించట్లేదు అని అన్నారు. ప్రభుత్వం నిర్లక్షం వల్లనే కౌలు రైతుల ఆత్మ హత్యలు పరంపరా కొనసాగుతున్నాయి. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా “తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ” అనేక ప్రజా సంఘాలు, ప్రముఖులతో ఏర్పడి ఈ విషయంలో విస్తృత ప్రచారం చేసి ప్రభుత్వం పై వత్తిడి తెస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగాTPJAC రాష్ట్ర నాయకులు బి. కొండల్ రెడ్డి, మాట్లాడుతూ కౌలు రైతుల పరిస్థితి పై సాధన కమిటీ రాష్ట్ర వ్యాప్త సర్వే నిర్వహించింది. 22 జిల్లాలు, 47 మండలాలు, 58 గ్రామాలలో 1816 మంది కౌలు రైతులను ప్రత్యక్షంగా కలిసి చేసిన ఈ సర్వేలో వెల్లడి అయిన ముఖ్యాంశాలను కమా అయన వివరించారు.
కౌలు రైతుల సర్వే నివేదిక తయారు చేసి ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సదస్సులు నిర్వహించి రాష్ట్రస్థాయి అధికారులు ప్రజా సంఘాలు ,వ్యవసాయ అనుబంధ రంగాల మంత్రులకు,అధికారులకు సమర్పించడం జరిగిందినీ. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు సాగుదారులకు ప్రతి సంవత్సరం గుర్తింపు కార్డులు ఇవ్వాలని,గుర్తింపు పొందిన కౌలు రైతుల అందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.సెప్టెంబర్ నెల చివరి లోపు కౌలు రైతుల గుర్తింపు మొదలు పెట్టాలని, అప్పుడే ఖరీఫ్ సీజన్లో పంట అమ్ముకోవడానికి వీలు అవుతుంది అని అన్నారు.ప్రతి పథకానికి ఫోన్ యాప్ లలో భూ యజమానికి ఓటీపీ పంపే వ్యవస్థ వలన కౌలు రైతులకి చాలా ఇబ్బంది కలుగుతున్నదని, సీజన్ మొదట్లోనే కౌలు రైతులకు గుర్తింపు ఇచ్చి అన్ని పథకాలలోనూ లబ్ధి కలిగించాలని డిమాండ్ చేశారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ కౌలు రైతుల పరిస్థితి గ్రామాలలో చాలా దారుణంగా ఉందని ఇది ఆర్థిక సామాజిక భూ సమస్యగా మారిందని ఆయన తెలిపారు.
గ్రామాలలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారికి అవసరమైనటువంటి పెట్టుబడులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అయినా తెలిపారు ఈ సమావేశంలో మాట్లాడిన కౌలు రైతులుబాగయ్య,మమత, శామ్యూల్, ఎన్.నాగరాజు మొగులయ్య, చంద్రం, బాలరాజు, శివాజీ. రాష్ట్ర స్థాయి సాధన కమిటీ తరఫున సంగారెడ్డి జిల్లా రైతు స్వరాజ్య వేదిక నాయకులు ఆర్.లక్ష్మీ, మనోజ్ కుమార్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే.మల్లేశం, బుజురంపేట సిద్ధిరాములు, సత్య శోధన మండలి నాయకులు విక్రమ్, సమావేశం లో పాల్గొన్నారు.






























