[t4b-ticker]

మునుగోడులో ఉనికి కోసం కూసుకుంట్ల ఆరాటం

  • కూసుకుంట్ల వ్యాఖ్యలను ఖండించిన చండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
  • నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు – కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక
  • బస్ షెల్టర్ పై అవినీతి ఆరోపణలు పూర్తిగా అబద్ధం – మున్సిపల్ పాలకవర్గం.
  • అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం – చండూరు కాంగ్రెస్ సవాల్.
  • చండూరు మున్సిపల్ ఛైర్మెన్ కోడి శ్రీనివాసులు .

ప్రతి పక్షం చండూరు, ఆగస్టు 18: చండూరు మున్సిపాలిటీలో మంగళవారం నాడు ప్రభుత్వ అతి గృహం నందు స్థానిక మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మరియు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిన్న నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ధర్నాలో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవాలను ప్రజలకు వివరించకుండా రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

కొన్ని దశాబ్దాల కాలంగా బస్సు షెల్టర్ల కోసం ఎదురుచూస్తున్న చండూరు ప్రజల వారికోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు తమ తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో బస్ షెల్టర్ నిర్మాణం ప్రారంభిస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు అది అవసరం లేదని మాట్లాడటం, దాని నిర్మాణం మొదట పండ్ల బండ్ల దగ్గర నిర్మిస్తామని చెప్పి వారి దగ్గర 12 లక్షలు తీసుకున్నారని ఆరోపించడం, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ డబ్బులు తీసుకున్నారని, వైన్ షాపుల దగ్గర, పండ్ల బండి వారి దగ్గర, ప్రైవేట్ హాస్పిటల్స్ వద్ద, కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర లక్షల రూపాయలు తింటున్నారని దేవుని దగ్గర ప్రమాణం చేస్తానని మాట్లాడారని, మీ మాట ప్రకారం మేము శనివారం రోజు ఉదయం 9:00 గంటలకు నేను, మున్సిపాలిటీ పాలకవర్గం అందరం మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ప్రమాణం చేస్తామని, మేము డబ్బులు తీసుకున్నట్లు మీరు ప్రమాణం చేయాలని అన్నారు.

ఎక్కడైనా ఒక రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే నేను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని… నువ్వు రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా కావడానికి సిద్ధమా? అని అన్నారు. కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్ మాట్లాడుతూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఒక మాజీ ఎమ్మెల్యే అని మరిచిపోయి, కల్లు తాగిన కోతిలా మాట్లాడుతున్నారని, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చండూరులో అడుగుపెట్టనివ్వబోమని అన్నారు. పండ్ల బండి వ్యాపారులు, వైన్స్ యాజమాన్యం ప్రెస్ మీట్ లో పాల్గొని ఎవరికీ ఎవరు కూడా ఒక రూపాయి ఇవ్వలేదని, మున్సిపల్ చైర్మన్ పై అబాండాలు మోపితే సహించమని, మేమందరం శనివారం గుడికి వచ్చి డబ్బులు ఎవరికి ఇవ్వలేదని ప్రమాణం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, కౌన్సిలర్లు బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న, మాజీ సర్పంచ్ కోడిగిరి బాబు, కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, మొగుదాల వెంకన్న, షరీఫ్, మున్సిపాలిటీ యూత్ ప్రెసిడెంట్ కన్నబోయిన నాగరాజు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏలే శ్రీను , జూలూరు వెంకటేశం, పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, బొమ్మరబోయిన వెంకటేశం, పున్న సైదులు, సమీర్,బుషిపాక సురేష్, కారింగు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News