[t4b-ticker]

కేంద్ర విద్యామంత్రిపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

ప్రతిపక్షం, జూలై 29: కేంద్ర కొత్త విద్యాశాఖ మంత్రి **ప్రహ్లాద్ జోషి**పై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. “అత్యాచార నిందితులను రక్షించే వ్యక్తి కంటే అసహ్యమైనవారు మరొకరు ఉండరు. అలాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం దేశ విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు అవమానం. కోట్లాది మంది యువతులు చదివే విద్యాసంస్థలు ఆయన ఆధీనంలో ఉండటం ఆందోళనకరం. భారత మహిళలు ఆయనను ఎప్పటికీ అంగీకరించరు” అని రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం వేదికగా వ్యాఖ్యానించారు.

అంతకుముందు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన ఆరోపణలను ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఆరోపణలు, ప్రతిఆరోపణల నేపథ్యంలో ఈ అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Spread the love

Related News

Latest News