[t4b-ticker]

హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్

ప్రతిపక్షం, ఆగస్టు 08: బోనాల వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయనున్నారు. చార్మినార్‌ జోన్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి.

రాజేంద్రనగర్, గోల్కొండ, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఆగస్టు 9 నుంచి 10 వరకు 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. సైబరాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి, రాయదుర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆగస్టు 9 రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్‌ చేయనున్నారు.

బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love

Related News

Latest News