*ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు.
*పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఉక్కు మహిళ ఇందిరమ్మ.
*భూసంస్కరణలు, సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ‘ఉక్కు మహిళ’
*దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి
ప్రతి పక్షం చండూరు, అక్టోబర్ 31: నల్గొండ జిల్లా చండూరు పట్టణ కేంద్రంలో భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలను శనివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు . కాంగ్రెస్ పార్టీ చండూరు మండల అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, చేతులు జోడించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘ఇందిరా గాంధీ అమర్ రహే’ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.ఈ సందర్భంగా చండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. భారతదేశ అభ్యున్నతి కోసం, దేశ సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన మహోన్నతమైన చరిత్ర గాంధీ కుటుంబానిదని కొనియాడారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు.
*పేదల పక్షపాతి ఇందిరమ్మ:
నాటి రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లను మంజూరు చేసిన ఘనత ఇందిరమ్మకే దక్కుతుందని సాగర్ రెడ్డి పేర్కొన్నారు. విప్లవాత్మక భూసంస్కరణల ద్వారా భూమి లేని లక్షలాది మంది పేదలకు సాగుభూమిని అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన పక్షపాతి అని కొనియాడారు. అందుకే నేటికీ ఆమె నిరుపేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు.
*ధైర్యసాహసాలకు మారుపేరు:
అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తిపతాకాన్ని ఎగురవేస్తూ, కఠినమైన నిర్ణయాలతో శత్రుదేశాలకు వణుకు పుట్టించిన ఇందిరా గాంధీ.. ‘ఉక్కు మహిళ’గా దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ఆమె ఆశయ సాధన కోసం, ప్రజాసేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కాంగ్రెస్ శ్రేణులంతా కదం తొక్కాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రెటరీ నలపరాజు శివనారి, జిల్లా నాయకులు కావాలి ఆంజనేయులు, కాసాల జనార్దన్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కృపాటి గణేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, ఎఫ్ ఎస్ డైరెక్టర్ కట్ట బిక్షం, సర్పంచులు ముక్కామల వెంకన్న ,బొమ్మల శేఖర్ ,జాల వెంకన్న ,బోయపల్లి శీను, ఉప సర్పంచ్ల మండల పూర్వ అధ్యక్షుడు సరికొండ ముత్యాలు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సోమలింగస్వామి, ఉపాధ్యక్షులు గంతేకంపు అశోక్ ,యువజన కాంగ్రెస్ నాయకులు భూషిపాక శంకర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పంగా రామకృష్ణ ,ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బుర్కల దశరథ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శేఖర్ ,మండల సెక్రెటరీ లు కట్టెకోల రామేశ్వరావు,ఇరిగి నరసింహ, తీగల శేఖర్,పర్సనబోయిన యాదయ్య ,ఉంగరాల వేమయ్య , దాసరి ఆంజనేయులు ,మండల నాయకులు బుర్కల ఎలక్షన్,ఇరిగి బిక్షం, మహిపాల్ రెడ్డి కృపాటి శ్రీను,రామలింగం, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.






























