[t4b-ticker]

ఫ్లాట్‌లో ‘సెలూన్’ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురి అరెస్ట్

ప్రతిపక్షం, ఆగస్టు 14, హైదరాబాద్: సోమాజిగూడలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ‘గ్లామరస్ ఫ్యామిలీ సెలూన్’ పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీసులు బుధవారం రాత్రి ఈ దాడి నిర్వహించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఎం.డీ. ఆఫ్తాబ్ అనే వ్యక్తి ఫ్లాట్‌ను కేంద్రంగా చేసుకుని ఏడాది కాలంగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాడి సమయంలో నిర్వాహకుడితో పాటు ఇద్దరు విటులు, నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ వ్యవహారానికి సంబంధించి ఫ్లాట్ యజమాని పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఫ్లాట్‌ను ఏ ఉద్దేశంతో అద్దెకు ఇచ్చారు? నిర్వాహకుడితో యజమానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అరెస్టయిన వారిని విచారిస్తూ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరికొందరి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. సెలూన్ పేరుతో సాగుతున్న కార్యకలాపాలపై సమాచారం ఎలా వచ్చింది, ఎంతకాలంగా నిర్వహిస్తున్నారు అనే అంశాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Spread the love

Related News

Latest News