కుమ్మరి ఎర్రకుంట పరిరక్షణకు ప్రత్యేక చర్యలు..!

•మురుగునీటి దారి మళ్లింపుతో కుమ్మరి మట్టికి రక్షణ!

•కుంటలో కుమ్మరి మట్టి సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రయత్నం

•ఎర్రకుంటను పరిశీలించిన కౌన్సిలర్లు, కుమ్మరి సంఘం నాయకులు

​వనపర్తి ప్రతినిధి, నవంబర్ 17, ప్రతిపక్షం: వనపర్తి ప్రాంతంలో ఉన్న ఎర్రకుంట పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయ కుమ్మరి వృత్తిదారుల సంక్షేమం దిశగా కీలక అడుగు పడింది. ఇందులో భాగంగా వనపర్తి పట్టణ పరిధిలోని బాల నగర్ వద్ద ఉన్న ఎర్రకుంట పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే.మేఘా రెడ్డి ఆదేశాలనుసారం స్థానిక కౌన్సిలర్.వెంకటేష్,13వ వార్డు కౌన్సిలర్ పరుశురాం,ఓబీసీ మోర్చా నాయకులు మన్నెం కొండన్న ,కుమ్మరి సంఘం పట్టణ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు నేరుగా కుంటను పరిశీలించి, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.గాంధీనగర్ ఎస్సి కాలనీ నుంచి కుమ్మరి ఎర్రకుంటలోకి నేరుగా వచ్చి చేరుతున్న మురుగునీటిని శాశ్వత ప్రాతిపదికన ప్రత్యామ్నాయ దారి మళ్లింపు ఏర్పాట్లు చేస్తున్నారు.కుంటలో లభ్యమయ్యే కుమ్మరి మట్టిని గుర్తించి మట్టిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు.దీనివల్ల కుంటల్లోకి మురుగునీరు చేరకుండా నివారించడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం కాకుండా సురక్షితంగా ఉండటంతో పాటు..కుమ్మరులకు నాణ్యమైన మట్టి లభ్యమయ్యే అవకాశం ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.వారి వెంట యువజన కాంగ్రెస్ నాయకులు నరసింహ, కొండన్న తిరుపతయ్యలు పాల్గొన్నారు.

​

Related News

Latest News