లక్ష్మాపూర్‌లో మట్టి దొంగల హల్‌చల్.. అడ్డూ అదుపూ లేకుండా మట్టి అక్రమ రవాణా!

కొద్దిరోజులుగా యథేచ్ఛగా మట్టి తరలింపు.. పట్టించుకోని రెవెన్యూ అధికారులు?

ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా స్పందన కరువు.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేదెప్పుడు?

ప్రతిపక్షం,శామీర్ పేట, నవంబర్ 18: మూడు చింతలపల్లి రెవెన్యూ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. గత కొద్దిరోజులుగా ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా భారీ వాహనాల ద్వారా మట్టిని తరలిస్తున్నట్లు పట్టించుకొని సంబంధిత అధికారులు.

మట్టి తవ్వకాలకు సంబంధించి సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పరిధిలో ఇంత బహిరంగంగా మట్టి రవాణా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు గ్రామీణ రహదారులు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లక్ష్మాపూర్‌లో జరుగుతున్న మట్టి తవ్వకాలు, రవాణాపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అనుమతులు లేకుండా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.అసలు లక్ష్మాపూర్‌లో జరుగుతున్న మట్టి తవ్వకాల వెనుక ఎవరున్నారు? అధికారుల నిర్లక్ష్యమా.. అక్రమార్కుల పలుకుబడా? అన్నది తేలాల్సి ఉంది.

Related News

Latest News