రూ.10 వేల లంచం తీసుకుంటూ జైలర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
ప్రతిపక్షం బ్యూరో, కరీంనగర్, సెప్టెంబర్ 07: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ సబ్ జైల్లో లంచం తీసుకుంటున్న జైలర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఈ దాడి జరిగింది.ఓ బాధితుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా జైలర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. హుజరాబాద్ సబ్ జైలు ప్రాంగణంలోనే ఈ ట్రాప్ నిర్వహించడం గమనార్హం.లంచం డిమాండ్‌కు సంబంధించిన ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.





























