ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 05: జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైభవం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలిరావడంతో కొంతసేపు తోపులాట చోటుచేసుకుంది. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్.జాతి రత్నాలు పైమ్ కుమారి పరియా అబ్దుల్లా చేతుల మీదు షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.ప్రారంభోత్సవం అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు ఒకేసారి షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు మహిళలు బట్టలు, చీరలు కొనుగోలు చేసేందుకు ముందుకు వెళ్లడంతో తోపులాట జరిగినట్లు ప్రత్యక్షంగా కనిపించింది.
ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం లేదా అపోహతో కూడా కొంతమంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నట్లు సమాచారం. దీంతో షాపింగ్ మాల్ ప్రవేశ ద్వారం వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, భారీగా జనసందోహం ఉండటంతో కొంతసేపు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పడిన ఈ రద్దీతో కొద్దిసేపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.






























